Advertisement
అక్షరటుడే, ఎల్లారెడ్డి : Loans : మహిళా సంఘాల సభ్యులు రుణాలను సకాలంలో చెల్లించాలని డీఆర్డీవో సురేందర్ సూచించారు. మొండి బకాయిల వసూలు కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఆయన ఆదేశించారు. లింగంపేట మహిళా సమాఖ్య భవనంలో మంగళవారం లింగంపేట, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, గాంధారి మండలాల సీసీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీఆర్డీఏ మురళీకృష్ణ, డీపీఎంలు రవీందర్, కిరణ్, రాజేందర్ ఏపీఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement