అక్షరటుడే, వెబ్డెస్క్ : Liquor Rates | తెలంగాణ ప్రభుత్వం Telangana government మందుబాబులకు త్వరలో షాక్ ఇవ్వనుంది. ఇప్పటికే బీర్ల ధరలు beer prices పెంచిన ప్రభుత్వం తాజాగా లిక్కర్ రేట్లు Liquor Rates పెంచాలని భావిస్తోంది.
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి state government మద్యం ద్వారా అధిక మొత్తం ఆదాయం సమకూరుతోంది. మరోవైపు సంక్షేమ పథకాల welfare schemes అమలుకు భారీగా ఖర్చు అవుతోంది. ఈ క్రమంలో మద్యం liquor rates రేట్లు పెంచి ఆదాయం సమకూర్చుకోవాలని భావిస్తోంది.
ప్రభుత్వం government ఫిబ్రవరిలో బీర్ల ధరలు 15 శాతం వరకు పెంచింది. దీంతో ఒక్కో బీరు సీసాపై సగటును రూ.20 నుంచి రూ.30 వరకు ధర పెరిగింది. తాజాగా మద్యం రేట్లను కూడా పెంచాలని భావిస్తోంది. అయితే పెంపు ఎంతమేర ఉంటుందనేది తెలియరాలేదు. పది శాతం వరకు పెంపు ఉండొచ్చని అధికారవర్గాల ద్వారా తెలిసింది. అయితే పేదలు ఎక్కువగా తాగే చీప్ లిక్కర్ cheap liquor రేట్లను పెంచకుండా ఇతర బ్రాండ్ల మద్యం ధరలను Liquor price మాత్రం పెంచాలని ప్రభుత్వం government యోచిస్తున్నట్లు సమాచారం.