అక్షరటుడే, ఇందూరు: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మెట్రో, ఇరిగేషన్ ప్రాజెక్టులు, మద్యం టెండర్లు, రహదారుల పనుల్లో రిజర్వేషన్ పాటించాలని బీఎల్ ఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్ డిమాండ్ చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అగ్ర పేదలైన బహుజన ప్రజలకు జనాభా దామాషా ప్రకారం కాంట్రాక్ట్ పనులను కేటాయించాలన్నారు. పనుల్లో 93 శాతం రిజర్వేషన్ పద్ధతి పాటించాలని కోరారు.