అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Posani | సినీ నటుడు పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali)కి బెయిల్ మంజూరైంది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో ఆయనపై నమోదైన కేసులో కడప మొబైల్ కోర్టు బెయిల్ ఇచ్చింది. పోసానిని కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల పిటిషన్‌ను జడ్జి కొట్టివేశారు. పోసాని తరఫున మాజీ ఏఏసీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదించారు.
Posani | రాష్ట్రవ్యాప్తంగా కేసులు
సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోసానిపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఓబులవారిపల్లె ఠాణాలో నమోదైన కేసులో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో పోసానిని అరెస్ట్ చేసి ఏపీకి తరలించారు. తాజాగా ఆ కేసులో ఆయనకు బెయిల్ వచ్చింది. అయితే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో నమోదైన కేసుల్లో ఆయనను అరెస్టు చేయాలని పోలీసులు భావించినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా బెయిల్ రావడంతో మరో కేసులో ఆయనను అరెస్టు చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.