Balagam Roopa Lakshmi : బ‌ల‌గంలో ఏడిపించిన న‌టి సోష‌ల్ మీడియాలో డ్యాన్స్‌ల‌తో పిచ్చెక్కిస్తుందిగా..!

Balagam Roopa Lakshmi : బ‌ల‌గంలో ఏడిపించిన న‌టి సోష‌ల్ మీడియాలో డ్యాన్స్‌ల‌తో పిచ్చెక్కిస్తుందిగా..!
Balagam Roopa Lakshmi : బ‌ల‌గంలో ఏడిపించిన న‌టి సోష‌ల్ మీడియాలో డ్యాన్స్‌ల‌తో పిచ్చెక్కిస్తుందిగా..!
Advertisement

అక్ష‌ర‌టుడే, వెబ్‌డెస్క్‌ Balagam Roopa Lakshmi : ఇండ‌స్ట్రీలో ఎవ‌రికి ఎప్పుడు బ్రేక్ వ‌స్తుందో చెప్ప‌లేం. చాలా సినిమాల‌లో న‌టించిన రాని గుర్తింపు బ‌ల‌గం సినిమ‌తో గుర్తింపు తెచ్చుకుంది రూప ల‌క్ష్మీ. పదేళ్ల క్రితం ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ సినిమాతో రూప లక్ష్మి తెలుగు సినిమాకు పరిచయం కాగా,ఇందులో ఆమె పాత్ర పెద్దగా నోటెడ్‌ కాలేదు. ఆ తర్వాత చాలా సినిమాల్లో అలా మెరిసింది. దువ్వాడ జగన్నాథం, మహర్షి, జాంబీ రెడ్డి, సరిలేరు నీకెవ్వరు, క్రాక్, వకీల్‌ సాబ్‌ వంటి సూపర్‌ హిట్ సినిమాల్లో నటించిన రూప లక్ష్మికి ఏ సినిమా కూడా పెద్ద గుర్తింపు తీసుకురాలేదు. అయితే బ‌ల‌గం సినిమాతో ఫుల్ పాపుల‌ర్ అయింది. 8 ఏళ్ల తర్వాత ‘బలగం’ సినిమాలో నటించి తన నటనతో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది.

Balagam Roopa Lakshmi  : క్రేజీ డ్యాన్స్..

‘బలగం’ చిత్రం ఇండస్ట్రీలో ఆమె గమనాన్ని మార్చింది. పరిణితి చెందిన నటనతో ఆమె ‘బలగం’ రూపలక్ష్మిగా పేరుగాంచింది. ఇప్పుడు సినిమాల్లో వరసగా మంచి పాత్రలు దక్కించుకుంటున్న ఈమె సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్. ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే లక్షకు పైగానే ఫాలోవర్స్ ఉన్నారు. ఇక సోష‌ల్ మీడియాలో ఈ అమ్మ‌డు ఒక వీడియో షేర్ చేయ‌గా, ఇది నెట్టింట వైర‌ల్ అవుతుంది. టీ షర్ట్‌, జీన్స్‌లో ‘ప్రేమికుడు’ చిత్రంలోని అందమైన ప్రేమరాణి మ్యూజిక్‌కి క్యూట్ స్టెప్స్ వేసింది. ఆమెను ఇలా చూడటం చాలా సర్‌ప్రైజింగ్‌గా ఉందంటూ పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

రూప ల‌క్ష్మీలో ఇలాంటి టాలెంట్ ఉందా అంటూ నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు. తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాల్లో కీలక పాత్రలో నటించే అవకాశాలు దక్కించుకుంటుంది. సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ సోషల్‌ మీడియా ద్వారా రూప లక్ష్మి రెగ్యులర్‌గా పోస్ట్‌లు షేర్‌ చేస్తూ ఉంటారు. తాజా వీడియోలో కొందరు జీన్స్ పాయింట్‌, టీ షర్ట్‌లో యాంకర్‌ అనసూయ కంటే మీరు చాలా అందంగా ఉన్నారంటూ కామెంట్ చేస్తుండ‌గా, కొందరు నెగటివ్‌గా కామెంట్ చేస్తున్నారు. ఇన్‌స్టాలో రూప లక్ష్మి డాన్స్‌కి కొంద‌రు క్రేజీ కామెంట్‌ చేస్తున్నారు.

Advertisement