అక్షరటుడే, ఆర్మూర్: పాదయాత్రగా శబరిమల వెళ్తున్న అయ్యప్ప స్వాములు జాగ్రత్తలు పాటించాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. ప్రశాంత్ రెడ్డి మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే పాదయాత్రగా శబరిమల వస్తానని మొక్కుకున్న భీమ్‌గల్ మాజీ ఎంపీపీ ఆర్మూర్ మహేష్ ఐదు రోజుల క్రితం ఇతర స్వాములతో కలిసి చేంగల్ గ్రామం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. గురువారం హైదరాబాద్ కొంపల్లిలోని రామాలయానికి పాదయాత్ర చేరగా అయ్యప్ప స్వాములను ప్రశాంత్ రెడ్డి కలిశారు. స్వాములకు ఎమ్మెల్యే భిక్ష ఏర్పాటు చేశారు.