అక్షరటుడే, కామారెడ్డి/కామారెడ్డి టౌన్: బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా.. ఛాంబర్ ఆఫ్ కామర్స్ పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం చేపట్టిన బంద్ ప్రశాంతంగా సాగుతోంది. వ్యాపార, వాణిజ్య సంస్థలు, ప్రైవేట్ పాఠశాలలను స్వచ్ఛందంగా మూసేశారు. రోడ్లపై నిర్మానుష్య వాతావరణం కనిపించింది. బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డీఎస్పీ నాగేశ్వరరావు, పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి, రూరల్ సీఐ రామన్, ఎస్సైల ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.