అక్షరటుడే, వెబ్డెస్క్: HCU Lands | హెచ్సీయూ భూముల అమ్మకం గురించి కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. హెచ్సీయూ(HCU)కు సంబంధించిన 400 ఎకరాలను ప్రభుత్వం వేలం వేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.
అయితే ఈ భూములు అమ్మొద్దని విద్యార్థులు ఆందోళనలు చేపడుతున్నారు. ఈ క్రమంలో భూముల వేలంపై బండి సంజయ్(Bandi Sanjay) స్పందించారు. యూనివర్సిటీ భూములు(University lands) అమ్మకపోతే ప్రభుత్వ పాలన సాగదన్నారు. భూములు అమ్మనిదే నెల గడవలేని స్థితికి కాంగ్రెస్(Congress) ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చిందని విమర్శించారు.
బీఆర్ఎస్(BRS) కంటే కాంగ్రెస్(Congress) పార్టీయే ఎక్కువ అరాచకాలు చేస్తోందని విమర్శించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థుల(Students)తో పోలీసులు అమానుషంగా వ్యవహరించారని బండి మండిపడ్డారు.
HCU Lands | వారు ఎందుకు స్పందించడం లేదు..
హెచ్సీయూ(HCU) భూముల అమ్మకాలపై విద్యా కమిషన్ ఛైర్మన్లు ఎందుకు స్పందించడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు. కమ్యూనిస్ట్ భావజాలం(Communist ideology) అని, ప్రజల సమస్యలపై కొట్లాడుతాం అని చెప్పుకునే నాయకులు నేడు ఎందుకు నోరు మెదపడం లేదని ఆయన అన్నారు.