Bandla Ganesh : మీ వ‌ల‌న అవుతుందా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్‌ని గెలికిన బండ్ల గ‌ణేష్‌

Bandla Ganesh : మీ వ‌ల‌న అవుతుందా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్‌ని గెలికిన బండ్ల గ‌ణేష్‌
Bandla Ganesh : మీ వ‌ల‌న అవుతుందా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్‌ని గెలికిన బండ్ల గ‌ణేష్‌
Advertisement

అక్ష‌ర‌టుడే, వెబ్‌డెస్క్ Bandla Ganesh : బండ్ల గ‌ణేష్‌.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కి చాలా సుప‌రిచితం. ఒకప్పుడు నటుడిగా వరుసగా సినిమాలు చేసిన బండ్ల గణేష్ ఆ తర్వాత నిర్మాతగా మారి ప‌లు సూప‌ర్ హిట్ సినిమాలు కూడా చేశారు. అయితే పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అయిన బండ్ల గణేష్ .. సమయం దొరికినప్పుడల్లా ఆయనను ఆకాశానికి ఎత్తేయ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. పవన్ కళ్యాణ్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నా కూడా బండ్లగణేష్ మాత్రం ఆయనకు భక్తుడు అనే చెప్పాలి. నటుడిగా పదుల సంఖ్యలో సినిమాలు చేసిన బండ్ల గణేష్ నిర్మాతగా మారి ఆంజనేయులు అనే చిత్రాన్ని నిర్మంచారు

ఆ త‌ర్వాత తీన్ మార్ , గబ్బర్ సింగ్, బాద్ షా, ఇద్దరమ్మాయిలతో సినిమాలు చేశాడు. ఇక బండ్లగణేష్ రాజకీయాలలో కూడా హ‌వా చూపించే ప్ర‌య‌త్నం చేశాడు. కాని అది క‌లిసి రాలేదు. ఇక ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బండ్లగణేష్ తన ట్వీట్స్ తో అందర్నీ ఆకట్టుకుంటూ ఉంటారు. అయితే బండ్ల గ‌ణేష్.. తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్‌కి స‌వాల్ విసిరాడు. పవన్ కళ్యాణ్ పాత చిత్రాలన్నీ కూడా ఇప్పుడు రీ రిలీజ్ అంటూ థియేటర్లోకి వ‌చ్చి సంద‌డి చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఫ్యాన్స్ తీన్ మార్ గురించి అడుగుతున్నారు. నిర్మాత బండ్ల గణేష్ కూడా ఈ తీన్ మార్‌ను రీ రిలీజ్ చేసేందుకు రెడీగానే ఉన్నాడు. డబ్బింగ్, సౌండ్ సింక్ మళ్లీ బాగా చేయించి రీ రిలీజ్ చేయ్ అన్నా అని బండ్ల గ‌ణేష్‌కి రిక్వెస్ట్‌లు చేస్తున్నారు.

ఇక దీనిక స్పందించిన బండ్ల గ‌ణేష్‌.. మీరు బ్లాక్ బస్టర్ చేస్తానంటే ఈ మూవీని రీ రిలీజ్ చేస్తాను అని అన్నాడు. అయితే నువ్వు వచ్చిన కలెక్షన్లను పార్టీకి ఇస్తానంటే బ్లాక్ బస్టర్ చేస్తామని ఇంకో ఫ్యాన్ కామెంట్ చేయ‌డం గ‌మ‌న‌ర్హం. అయితే దానికి కూడా బండ్లన్న రిప్లై ఇస్తూ.. వచ్చిన మొత్తాన్ని కూడా పార్టీకే ఇస్తాను అని మాటిచ్చాడు. మ‌రి నిజంగానే బండ్ల గ‌ణేష్ తీన్‌మార్ మూవీని రీరిలీజ్ చేస్తాడా లేదా అనేది చూడాలి. ఈ ఏడాది పవన్ కళ్యాణ్ బర్త్ డే (సెప్టెంబర్ 2) సందర్భంగా ఈ మూవీని రీ రిలీజ్ చేసే ప్లాన్స్ ఉన్న‌ట్టు టాక్ న‌డుస్తుంది.

Advertisement