అక్షరటుడే, వెబ్ డెస్క్: మహారాష్ట్రలోని పుణె ప్రధాన కేంద్రంగా ఉన్న బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీవోఎం)కు సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకు శాఖల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు నేటి నుంచి అక్టోబర్ 24వ తేదీలోగా ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

ఖాళీల వివరాలు..

అప్రెంటిస్: 600 ఖాళీలు (ఎస్సీ- 65, ఎస్టీ- 48, ఓబీసీ- 131, ఈడబ్ల్యూఎస్- 51, యూఆర్- 305) ఉండగా.. ఆంధ్రప్రదేశ్ లో 11, తెలంగాణలో 16 పోస్టులు ఉన్నాయి.

అర్హత: డిగ్రీ(గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి).

వయోపరిమితి: 30-06-2024 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10-15 ఏళ్ల సడలింపు ఉంటుంది.

స్టైఫండ్ : నెలకు రూ.9000.

ఎంపిక ప్రక్రియ: 12వ తరగతి (హెచ్ఎన్సీ/ 10+2)/ డిప్లొమా మార్కులు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు రుసుము: యూఆర్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీలకు రూ.150 + జీఎన్టీ, ఎస్సీ/ ఎస్టీలకు రూ.100 + జీఎస్టీ, దివ్యాంగులకు మినహాయింపు ఉంటుంది. పూర్తి వివరాలు https://bankofmaharashtra.in/ వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి.