Bank Holidays : వరుసగా బ్యాంకులకు సెలవులు.. ఏవైనా పనులు ఉంటే ముందే చేసుకోండి

Bank Holidays : వరుసగా బ్యాంకులకు సెలవులు.. ఏవైనా పనులు ఉంటే ముందే చేసుకోండి
Bank Holidays : వరుసగా బ్యాంకులకు సెలవులు.. ఏవైనా పనులు ఉంటే ముందే చేసుకోండి
Advertisement

అక్ష‌ర‌టుడే, వెబ్‌డెస్క్‌ Bank Holidays : మార్చి నెలలో బ్యాంకులకు వరుసగా సెలవులు(Banks Holidays) రానున్నాయి. ఇప్పటికే 13 రోజులు గడిచిపోయినా, రాబోయే 17 రోజుల్లో బ్యాంకులకు వరుసగా సెలవులు రాబోతున్నాయి. దీంతో ఏవైనా పనులు ఉంటే ముందే చేసుకోవాలని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. నిజానికి మార్చి నెలలో 14 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. దాని వల్ల కస్టమర్లకు చాలా ఇబ్బందులు రానున్నాయి. మరోవైపు ఫైనాన్సియల్ ఇయర్ ఎండింగ్ (banks holidays on March) ఇది. ఈ నెలలోనే 2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అన్ని లావాదేవీలను ముగించాల్సి ఉంది. మరోవైపు సెలవులు ఎక్కువగా ఉండటంతో బ్యాంకు సిబ్బంది మీద పని ఒత్తిడి భారం పెరగనుంది.

ఇప్పటి వరకు బ్యాంకులకు ఈ నెలలో 5 రోజుల సెలవులు వచ్చాయి. మార్చి 14న హోలీ సందర్భంగా సెలవు. ఆ తర్వాత శనివారం అంటే మార్చి 15న బ్యాంకులు ఓపెన్ కానున్నాయి. ఆ తర్వాత మళ్లీ మార్చి 16న ఆదివారం సందర్భంగా మూతపడనున్నాయి. ఆ తర్వాత మార్చి 22న నాలుగో శనివారం, 23న ఆదివారం, 30న ఆదివారం, 31న రంజాన్ సెలవు ఉండనుంది. మార్చి 27, 28న జమ్ములో రెండు రోజుల పాటు షాబ్ ఏ క్వాదర్, జుమాట్ ఉల్ విదా అనే పండుగల నేపథ్యంలో రెండు రోజులు బ్యాంకులు మూత పడనున్నాయి.

Bank Holidays : మార్చి 15న కూడా సెలవే

మరోవైపు మార్చి 15న అంటే శనివారం కొన్ని రాష్ట్రాల్లో హోలీ జరుపుకోనున్నారు. అగర్తల, భువనేశ్వర్, ఇంఫాల్, పాట్నా లాంటి ప్రాంతాల్లో మార్చి 15న హోలీ. ఈనేపథ్యంలో మార్చి 15న అక్కడ బ్యాంకులు మూతపడనున్నాయి. అంటే వరుసగా రెండు రోజులు మూతపడనున్నాయి. మార్చి 22న బీహార్ లో బీహార్ దివాస్ సందర్భంగా బ్యాంకులకు సెలవును ప్రకటించారు.

Advertisement