అక్షరటుడే, వెబ్డెస్క్: BANK HOLIDAYS | సాంకేతికత ఎంత పెరిగినా కొన్ని పనుల కోసం ఇప్పటికీ బ్యాంకులకు(BANK) వెళ్లాల్సిందే. లాకర్లో వస్తువులు దాచుకోవాలన్నా, DD తీయాలన్నా, వస్తువులు తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవాలన్నా బ్యాంకులకు వెళ్తేనే పని అవుతుంది. అయితే తీరా బ్యాంకుకి వెళ్లాక ఆ రోజు హాలిడే(HOLIDAY) అని తెలిస్తే సమయం అంతా వృథా అవుతుంది. అందుకే ఆర్బీఐ(RBI) బ్యాంక్ హాలిడేల జాబితాను ముందే విడుదల చేస్తుంది. ఏప్రిల్(APRIL)లో బ్యాంకులు ఎన్ని రోజులు పనిచేస్తాయో ఎన్ని రోజులు మూసి ఉంటాయో తెలుసుకుంటే అనుగుణంగా ప్లాన్(PLAN) చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏప్రిల్ లో ఏ రోజుల్లో బ్యాంకు సెలవులు ఉన్నాయో తెలుసుకుందాం..
- ఏప్రిల్ 1: ఆర్థిక సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో ఖాతాల సర్దుబాటు దృష్ట్యా సాధారణ కార్యకలాపాలు నిర్వహించరు.
- ఏప్రిల్ 5 : బాబు జగ్జీవన్ రామ్ జయంతి.
- ఏప్రిల్ 6: శ్రీరామనవమి.
- ఏప్రిల్ 10: మహావీర్ జయంతి.
- ఏప్రిల్ 12: రెండో శనివారం.
- ఏప్రిల్ 13: ఆదివారం.
- ఏప్రిల్ 14: అంబేద్కర్ జయంతి.
- ఏప్రిల్ 20: ఆదివారం.
- ఏప్రిల్ 26: నాలుగో శనివారం.
- ఏప్రిల్ 27: ఆదివారం.