అక్షరటుడే, జుక్కల్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికను శుక్రవారం నిజాంసాగర్ విద్యుత్ ఉప కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు బాన్సువాడ డీఈ ప్రభాకర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి వేదిక ఛైర్మన్ నారాయణ, టెక్నికల్ మెంబర్ రామకృష్ణ హాజరు కానున్నారు. నిజాంసాగర్, పిట్లం, పెద్ద కొడప్గల్ మండలాల విద్యుత్ వినియోగదారులు వేదికను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.