అక్షరటుడే, బాన్సువాడ: రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బాన్సువాడ మున్సిపల్ వైస్ ఛైర్మన్ షేక్ జుబేర్ అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఆదివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం వానాకాలం రైతు భరోసా చెల్లించక రైతులను మోసం చేసిందని మండిపడ్డారు. రూ. రెండు లక్షల రుణమాఫీ, రూ. 500 బోనస్, మహిళలకు గృహలక్ష్మి పథకం, రైతు కూలీలకు రూ. 12 వేలు, నిరుద్యోగులకు జీవన భృతి అమలు చేయడంలో విఫలమైందన్నారు. కార్యక్రమంలో మోచి గణేష్, గౌస్, రమేశ్ యాదవ్, ప్రకాశ్, రాజు, సాయిలు, అఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు.