అక్షరటుడే, జుక్కల్: పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలని బాన్సువాడ రూరల్ సీఐ సత్యనారాయణ సూచించారు. గురువారం నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటుచేసిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వినాయక మండపాల ఏర్పాటు కోసం ముందుగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. మండపాల వద్ద ప్రతిరోజు నిర్వాహకులు కాపలా ఉండాలని, డీజేలకు అనుమతి లేదని తెలిపారు. నిమజ్జనం సమయంలో జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఎస్సై సుధాకర్, ఎంపీడీవో గంగాధర్, తహసీల్దార్ భిక్షపతి, ట్రాన్స్ కో ఏఈ లక్ష్మణ్ పలు సూచనలు చేశారు. నాయకులు బాలసాయిలు, అనీస్, రాము రాథోడ్, ఎజాస్, కర్ణం శ్రీనివాస్, గాండ్ల రమేష్, కురుమ మల్లేష్, లోక్య నాయక్ తదితరులు ఉన్నారు.