అక్షరటుడే, బాన్సువాడ: ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి సూచించారు. పట్టణంలోని మిషన్ భగీరథ కార్యాలయంలో సోమవారం గ్రామ తాగునీటి సహాయకులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. పైప్ లైన్‌లు లీకేజీలు ఉంటే పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు.