అక్షరటుడే జుక్కల్‌: పాఠశాలల్లో మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టాలని లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని బాన్సువాడ సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయి అధికారులను ఆదేశించారు. బుధవారం నిజాంసాగర్‌లోని అచ్చంపేట ఆదర్శ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి నిర్వాహకులపై మండిపడ్డారు. అచ్చంపేటలో దళితబంధు లబ్ధిదారులతో మాట్లాడారు. తహసీల్దార్‌ కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. గోల్‌బంగ్లా సమీపంలో టూరిజం కోసం సేకరించిన నాలుగెకరాల భూమిని పరిశీలించారు. తహసీల్దార్‌ భిక్షపతి, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్‌ కార్తీక సంధ్య, ఆర్‌ఐ అంజయ్య తదితరులున్నారు.

Advertisement
Advertisement