అక్షరటుడే, బాన్సువాడ: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తరుగు తీయొద్దని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. బాన్సువాడ మండలంలోని బుడిమి కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆమె సందర్శించారు. మాయిశ్చర్ యంత్రాన్ని పరిశీలించారు. తరుగు తీస్తే చర్యలు తప్పవని నిర్వాహకులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ వరప్రసాద్ తదితరులున్నారు.