అక్షరటుడే, బాన్సువాడ: నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అనుచరులు ఒక్కొక్కరిగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. గురువారం మండలంలోని బుడిమి సొసైటీకి చెందిన ఐదుగురు డైరెక్టర్లు ఏనుగు రవీందర్ రెడ్డి, మండవ వెంకటేశ్వరరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సొసైటీలో మొత్తం 13 మంది డైరెక్టర్లు ఉండగా ఇప్పటివరకు 9 మంది కాంగ్రెస్ గూటికి వెళ్లారు. త్వరలోనే సొసైటీ ఛైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టనున్నట్లు తెలుస్తోంది. వైస్ ఛైర్మన్ మధుసూదన్ రెడ్డి అధ్యక్షుడు అయ్యే అవకాశాలు ఉన్నాయి.