అక్షరటుడే, బాన్సువాడ: పట్టణానికి చెందిన వ్యాపారవేత్త, బీఆర్ఎస్ నాయకుడు మొహరీల్ శ్రీనివాసరావు గురువారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. బాన్సువాడ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంఛార్జి ఏనుగు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ గూటికి చేరారు. హైదరాబాద్ లో మంత్రి జూపల్లి కృష్ణారావు కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు.