అక్షరటుడే, బాన్సువాడ: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామని మాజీ జడ్పీటీసీ, కాంగ్రెస్ నేత నార్ల రత్నకుమార్ అన్నారు. గురువారం బాన్సువాడలో విలేకరులతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతి, అక్రమాలను ప్రజలు గమనించి కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టారన్నారు. తాము అధికారంలోకి వచ్చాక అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని పేర్కొన్నారు. సీనియర్ నేత ఏనుగు రవీందర్ రెడ్డిపై పోచారం భాస్కర్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో నాయకులు శేఖర్‌రెడ్డి, సురేశ్, రాఘవేందర్, వెంకట్‌రెడ్డి, అఫ్రోజ్, అన్వర్, నాగరాజు, హన్మాండ్లు, శ్రీనివాస్ పాల్గొన్నారు.