అక్షరటుడే, బాన్సువాడ: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ బాన్సువాడలో కాంగ్రెస్ నాయకులు బుధవారం ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిని బాల్క సుమన్ దూషించడం శోచనీయమన్నారు. బీఆర్‌ఎస్ నాయకులు అధికారం కోల్పోగానే మతిభ్రమించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. అనంతరం బాన్సువాడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాసాని శ్రీనివాస్ రెడ్డి, నార్ల రత్నకుమార్, నార్ల రాఘవేందర్ రావు, మధుసూదన్ రెడ్డి, హన్మాండ్లు, వెంకట్ రెడ్డి, అఫ్రోజ్, లాయక్, అక్బర్, రహీం, అన్వర్ తదితరులు పాల్గొన్నారు.