అక్షరటుడే, బాన్సువాడ: వచ్చే హనుమాన్ జయంతి నాటికి బాన్సువాడలో 108 అడుగుల హనుమాన్ విగ్రహం ఏర్పాటు చేస్తామని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి పోచారం భాస్కర్ రెడ్డి తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కు మద్దతుగా సోమవారం బాన్సువాడ మండలంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా 108 అడుగుల హనుమాన్ విగ్రహం లేదని, మొదటిసారిగా బాన్సువాడలో నిర్మిస్తామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంజిరెడ్డి, వైస్ ఎంపీపీ హరి సింగ్, మండల పార్టీ అధ్యక్షుడు మోహన్ నాయక్, వెంకట్రామిరెడ్డి, అంబర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.