‘మాకు ఉచితాలు కాదు.. దేశ భద్రత కావాలి..’

0

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ‘మాకు పనికిమాలిన ఉచిత పథకాలు వద్దు.. దేశ భద్రత కావాలి..’ అంటూ నసృల్లాబాద్ మండలం నెమ్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వైరల్‌గా మారింది. ‘దేశ భద్రత కోసం సీఏఏ, ఎన్‌ఆర్సీ అమలు చేయాలి. సనాతన ధర్మ పరిరక్షణకు, హిందూ ఆలయాల రక్షణ కోసం హిందూ ధార్మిక పరిషత్‌ ఏర్పాటు చేయాలి. బలవంతపు మత మార్పిడి నిరోధక చట్టం కావాలి. అన్నదాతల ఆత్మహత్యలు లేని వ్యవసాయ విధానాలు రావాలి. గోవధ నిషేధ చట్టం అమలు జరపాలి’.. ఇవి ఇచ్చేటట్లయితేనే మా గ్రామానికి ఓట్ల కోసం రావాలంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.