అక్షరటుడే, జుక్కల్ : భారీ వర్షాలతో ఈసారి నిజాంసాగర్ ప్రాజెక్టును నిండుకుండలా మార్చిన వరుణదేవుడికి రుణపడి ఉంటానని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్‌తో కలిసి నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద పూజలు చేసి, నీటి విడుదల ప్రారంభించారు. ఈసారి వానాకాలం సీజన్‌కు ముందే ప్రాజెక్టులో తగినంత నీటి నిల్వలు లేకున్నా ఆయకట్టు కింద పంటలకు సాగునీరందించాలని కోరగానే సీఎం రేవంత్‌రెడ్డి నీటి విడుదలకు ఒప్పుకున్నారని, ఇందుకు సీఎంకూ కృతజ్ఞతలు తెలిపారు. ఎగువన సింగూరుకు భారీగా ఇన్‌ఫ్లో వస్తున్న నేపథ్యంలో ముందస్తుగా నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల ప్రారంభించామన్నారు. యాసంగి పంటల సాగుకు అవసరమైన నీటిని నిల్వ చేసి, అదనపు నీటిని విడుదల చేయాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, ఇరిగేషన్ అధికారులు శ్రీనివాస్, వాసంతి, సోలోమన్, శివ ప్రసాద్, నాయకులు జయప్రదీప్, రవీందర్ రెడ్డి ప్రజాపండరి ఉన్నారు.