అక్షరటుడే, బాన్సువాడ: మండలంలోని ఆదర్శ పాఠశాల హిందీ ఉపాధ్యాయుడు విజయ్‌కుమార్‌కు ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్‌డీ పట్టా ప్రదానం చేసింది. హిందీ విభాగంలోని బోర్డు ఆఫ్ ఛైర్‌పర్సన్ సంగీత వ్యాస్ పర్యవేక్షణలో సమకాలీన ‘హిందీ కహానియో మే గ్రామీణ జీవన్’ అనే అంశంపై అధ్యయనం చేశారు. హెచ్‌వోడీ మాయదేవి చేతుల మీదుగా పట్టా అందుకున్నారు.