అక్షరటుడే, బాన్సువాడ: ధాన్యం కొనుగోళ్లను త్వరగా పూర్తి చేయాలని బాన్సువాడ ఆర్డీవో రమేశ్ రాథోడ్ ఆదేశించారు. శనివారం బాన్సువాడ ఆర్డీవో కార్యాలయంలో డివిజన్ పరిధిలోని రైస్ మిల్లర్స్, సహకార సంఘం కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోకుండా చూడాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.