అక్షరటుడే, బాన్సువాడ: బాన్సువాడ ఆర్టీసీ డిపోలో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ మేనేజర్(ట్రాఫిక్) బన్సిలాల్ సస్పెన్షన్ కు గురయ్యారు. ఈ మేరకు ఉన్నతాధికారులు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. బన్సిలాల్ తీరుపై ఉద్యోగులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. డబ్బులు ఇచ్చిన వారికే అనుకున్న ప్రాంతాలకు విధులు వేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణ చేపట్టిన అధికారులు ఆయన్ను సస్పెండ్ చేసినట్లు డీఎం సరితా దేవి తెలిపారు.