అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: నగరంలోని మెడికవర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులకు శుక్రవారం బారికేడ్లు అందజేశారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేసేందుకు 50 బారికేడ్లను ఆస్పత్రి హెడ్ స్వామి ట్రాఫిక్ ఏసీపీ నారాయణకు అందజేశారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ ప్రసాద్, ఎస్సైలు, ఆస్పత్రి మార్కెటింగ్ హెడ్ వినయ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
Advertisement