అక్షర టుడే, ఆర్మూర్ : ఆర్మూర్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ ఆవరణలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్ పర్సన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ ఆకుల రాము, జంబీ హనుమాన్ ఆలయ కమిటీ ఛైర్మన్ రేగుల్ల సత్యనారాయణ, దొండి రమణ, హరీశ్, నారాయణ రెడ్డి, భోజన్న, కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు సాయిబాబా గౌడ్, జిమ్మి రవి, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.