అక్షరటుడే, ఇందూరు: బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్ మేదరుల జీవన స్థితిగతులు తెలుసుకునేందుకు పట్టణంలోని బురుడ్ గల్లీలో మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఇల్లులేని మేదరులకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని మేదర కులస్థులు కోరారు. వెదురుతో తయారుచేసిన వస్తువులను విక్రయించేందుకు జిల్లా కేంద్రంలో నిర్మించిన ప్రభుత్వ దుకాణాల సముదాయంలో తమకు షాపులు కేటాయించాలని కోరారు. 29 రాష్ట్రాల్లో ఉన్న మేదరులు ఎస్సీ, ఎస్టీలలో ఉన్నారని, తెలంగాణలో కూడా ఎస్టీల్లో చేర్పించాలని విన్నవించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు దేవేందర్, అనుబంధ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
