అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : జిల్లాకు ఈనెల 29న బీసీ కమిషన్ బృందం రానుంది. రాష్ట్రంలో చేపట్టబోయే కులగణనపై ఆయా పార్టీలు, సంఘాలు, ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు వారు జిల్లాకు రానున్నట్లు కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో ఉదయం 10గంటలకు బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్ ఆధ్వర్యంలో సమావేశం జరుగనుంది.