గీతా కార్మికులకు శిక్షణ

0

అక్షర టుడే, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్లో గీతా కార్మికులకు సేఫ్టీ మెలకువల ఉపయోగంపై బీసీ కార్పొరేషన్, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ నిర్వహించారు. తాటి చెట్లు ఎక్కడంపై గీతా కార్మికులకు మెలకువలను తెలియజేశారు. ఈ సందర్భంగా కల్లుగీత కార్మిక రాష్ట్ర సలహాదారు పెద్ద వెంకట రాములు మాట్లాడుతూ ఇప్పటివరకు జిల్లాలో మూడు కేంద్రాల్లో శిక్షణ ఇచ్చామన్నారు. శిక్షణ తీసుకున్న వారికి కాటమయ్య రక్షణ కవచం కిట్లను పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో కార్పొరేషన్ ఈడీ రమేష్, శిక్షకుడు బుచ్చ గౌడ్, అనిల్ గౌడ్,జితేందర్ గౌడ్, సాదయ్య, నరసయ్య, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.