అక్షరటుడే, ఆర్మూర్: విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని బీసీ అభివృద్ధి అధికారులు నర్సయ్య, గంగాధర్ సూచించారు. గురువారం వేల్పూర్ మండల కేంద్రంలోని బీసీ హాస్టల్‌లో నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశంలో వారు మాట్లాడారు. తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. విద్యార్థులు దుస్తులను శుభ్రంగా ఉంచుకుంటే చర్మ వ్యాధులు రావని పేర్కొన్నారు. త్వరలో పేరెంట్స్ కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ హెచ్ఎం రాజన్న, డాక్టర్ సంతోష్, ఎస్సీ హాస్టల్ వార్డెన్ ప్రవీణ్, బీసీ హాస్టల్ వార్డెన్ భోజేందర్, ఆరోగ్య కార్యకర్తలు రాధిక, ఆశా వర్కర్ ఇందిర పాల్గొన్నారు.