Advertisement

అక్షరటుడే, నిజాంసాగర్‌: BC Hostel : కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలోని బీసీ వసతి గృహంలో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించడం లేదు. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. సమయానికి భోజనం అందక ఇబ్బందులు పడుతున్నారు.

ఆదివారం సాయంత్రం వసతి గృహంలో పరిశీలించగా.. విద్యార్థులకు అన్నంతో పాటు ఆలుగడ్డ కర్రీ, సాంబారు వడ్డించారు. మెనూ ప్రకారం.. మధ్యాహ్నం భోజనంలో చికెన్‌ కర్రీతో పాటు సాంబారు బగారా రైస్‌ అందించాలి.

కానీ, మధ్యాహ్నం వండిన ఆలుగడ్డ కర్రీనే రాత్రి కూడా వడ్డించారు. అంతే కాకుండా సిబ్బంది సైతం విధులకు సక్రమంగా హాజరు కావడం లేదు. సంబంధిత అధికారులు పర్యవేక్షించి, విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించేలా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Advertisement