Advertisement

అక్షరటుడే, నిజాంసాగర్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ నాయకులను గెలిపించుకోవాలని బీసీ రాజ్యాధికార సమితి కామారెడ్డి జిల్లా ఇన్ ఛార్జి అధ్యక్షుడు కుమ్మరి యాదగిరి అన్నారు. ఈ సందర్భంగా బీసీలందరూ ఏకతాటిపైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలో బీసీ రాజ్యాధికారి సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, అడ్వకేట్ భాస రాజేశ్వర్ ను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. అనంతరం ఆయనతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీసీ సంఘాల అభివృద్ధి, బీసీల సమస్యలపై చర్చించారు.

Advertisement