అక్షరటుడే, ఇందూరు: విద్యుత్ సంస్థలో పనిచేసే పవర్ డిప్లొమా ఇంజినీర్లు క్రమశిక్షణతో మెలగాలని తెలంగాణ పవర్ డిప్లొమా ఇంజినీర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీసీ రెడ్డి అన్నారు. గురువారం యాదాద్రిలోని అతిథి గృహంలో టీపీడీఈఏ డైరీ-2025 ఆవిష్కరణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన డిప్లొమా ఇంజినీర్లను ఉద్దేశించి పలు సూచనలు చేశారు. పెండింగ్‌లో ఉన్న ఏఈల ప్రమోషన్లకు కృషి చేస్తున్నామని, సీఎండీ వరుణ్ రెడ్డి సుముఖంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో ఆర్థిక కార్యదర్శి నరేశ్, ఉత్తర, దక్షిణ కంపెనీ అధ్యక్ష కార్యదర్శులు ఇంద్రసేనారెడ్డి, మనోరంజన్ రెడ్డి, సుబ్రమణ్యేశ్వర్ రావు, తాజుద్దీన్ బాబా, రాష్ట్ర నాయకులు మధుసూదన్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, చలపతి రావు, నరేందర్, 33 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, సబ్ ఇంజినీర్లు, ఏఈలు, ఏడీఈలు పాల్గొన్నారు.
పవర్ డిప్లొమా ఇంజినీర్లు క్రమశిక్షణతో మెలగాలి
Advertisement
Advertisement