అక్షరటుడే, వెబ్‌డెస్క్: రాజ్యసభ ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థిగా బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య మంగళవారం నామినేషన్ వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. చట్ట సభల్లో బీసీల రిజర్వేషన్లపై పోరాటం చేస్తానని, బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీతోనే సాధ్యమన్నారు. అలాగే టీడీపీ నుంచి బీదమస్తాన్‌రావు, సానా సతీశ్ నామినేషన్ దాఖలు చేశారు. ఏపీలో ఇటీవల ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే.