అక్షరటుడే, ఇందూరు: బీసీ ఉపాధ్యాయ సంఘం నూతన కార్యవర్గాన్ని శనివారం ఎన్నుకున్నారు. సంఘం రాష్ట్ర సలహాదారు రమణస్వామి ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. జిల్లా అధ్యక్షుడిగా మాడవేడి వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా గోపాలకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు వినోద్ మాట్లాడుతూ.. మరోసారి తనకు అవకాశం కల్పించిన జిల్లా కార్యవర్గానికి ధన్యవాదాలు తెలిపారు. నూతన పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, పెండింగ్ బిల్లులను చెల్లించాలని కోరారు. దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.