అక్షరటుడే,ఇందూరు : బీసీ కుల గణనను అడ్డుకునే నాయకుల ఇంటి ముందు ధర్నా చేస్తామని బీసీ సంక్షేమ సంఘం నాయకుడు నరాల సుధాకర్ హెచ్చరించారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కులగణనను అడ్డుకుంటే ఎవరినీ వదిలిపెట్టమని అన్నారు. ప్రభుత్వం బీసీ కుల గణన చేస్తే కొందరు అగ్రవర్ణ నాయకులు ప్రజలను తప్పుతోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. సమావేశంలో నాయకులు ఆంజనేయులు, రవీందర్, దేవేందర్, శంకర్, చంద్రకాంత్, గంగాధర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.