యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా నరేశ్‌

0

అక్షరటుడే, కామారెడ్డి: జాతీయ బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఇసాయిపేట నరేశ్‌ నియమితుల య్యారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయనకు నియామక పత్రం అందజేశారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుదర్శన్‌, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు శంకర్‌ నేత, నాయకులు శ్రవణ్‌ కుమార్‌ గౌడ్‌, సంగా గౌడ్‌, మహేందర్‌ పాల్గొన్నారు.