IPL | బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం.. బంతికి సలైవా నిబంధన ఎత్తివేత

IPL | బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం.. బంతికి సలైవా నిబంధన ఎత్తివేత
IPL | బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం.. బంతికి సలైవా నిబంధన ఎత్తివేత
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్ : IPL | ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) టోర్నీ ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న విష‌యం తెలిసిందే. అన్ని జట్లు టోర్నీలో సత్తా చాటేందుకు సంసిద్ధమ‌వుతుండ‌గా, ఈ సారి పోరు ఎలా ఉంటుందో అని అంద‌రు ఎంతో ఆస‌క్తిగా గ‌మ‌నిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఐపీఎల్ టోర్నీ అంటేనే సిక్సులు, ఫోర్లతో స్టేడియం మోతమోగిపోతుంది. దీంతో బ్యాటర్ల దూకుడును అడ్డుకోవాలంటే బౌలర్లు ఎంతో క‌ష్ట‌ప‌డాల్సిన ప‌రిస్థితి ఉంది. అయితే ఎక్కువ శాతం మ్యాచ్​లలో బ్యాటర్ల ఆటతీరుపైనే గెలుపోటములు ఆధారపడి ఉంటుంటాయి. అయితే, ఈ ఐపీఎల్ సీజన్​లో బౌలర్లకు బీసీసీఐ(BCCI) గుడ్ న్యూస్ చెప్పింది.

IPL | స‌లైవాకి ఓకే..

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2025 ప్రారంభానికి ముందు బీసీసీఐ బౌలర్లకు(Bowlers) శుభవార్త చెప్పింది. సలైవా(Saliva) పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. ఐపీఎల్‌(IPL) జట్ల కెప్టెన్లతో బీసీసీఐ గురువారం సమావేశం నిర్వహించ‌గా, పలు కొత్త రూల్స్‌(New Rules) గురించి కెప్టెన్లకు వివరించింది. కరోనా(Corona) సమయమంలో బంతి మెరిసేందుకు సలైవా (ఉమ్మి)ని వాడడాన్ని ఐసీసీ(ICC) నిషేధించింది. ఐపీఎల్‌లోను నిషేధాన్ని అమలు చేశారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Virat Kohli : కోహ్లీ కాదు, ఎవరు చెప్పినా వినేదిలే.. బీసీసీఐ వార్నింగ్

తాజాగా ముంబయిలో జరిగిన ఐపీఎల్‌ కెప్టెన్ల సమావేశంలో సలైవా ఉపయోగంపై ఉన్న బ్యాన్‌ను ఎత్తివేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుందని ఓ ఉన్నత అధికారి చెప్పినట్లు సమాచారం. ఐపీఎల్‌లో లాలాజలంపై నిషేధాన్ని ఎత్తివేయడంలో ఎటువంటి హాని లేదని తాము భావిస్తున్నట్లు ఆ అధికారి తెలిపారు. చాలామంది కెప్టెన్లు బ్యాన్‌ ఎత్తివేసేందుకు అనుకూలంగా ఉన్నారని చెప్పారు.

Advertisement