అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: దేశీయ స్టాక్‌ మార్కెట్‌పై బేర్‌ పంజా విసిరింది. ఉదయం భారీ నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభం కాగా.. మధ్యలో నిఫ్టీ సుమారు వంద పాయింట్ల వరకు రికవరీ అయ్యింది. కానీ కొంతసేపటికే సూచీలు భారీగా పడిపోయాయి. సెన్సెక్స్ 2222 పాయింట్లు, నిఫ్టీ 662 పాయింట్లు, బ్యాంక్‌ నిఫ్టీ 1258 పాయింట్ల నష్టంతో మార్కెట్‌ క్లోజ్‌ అయ్యింది. మార్కెట్లు భారీగా పతనమవడంతో ఒక్కరోజులో రూ.14 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ఒకవైపు అమెరికాలో ఆర్థిక మాంద్యం భయం, ఇజ్రాయిల్‌ – ఇరాన్‌ మధ్య ఘర్షణపూరిత వాతావరణం, జపాన్‌ స్టాక్‌ మార్కెట్‌లో తీవ్ర అమ్మకాల ఒత్తిడి, మరోవైపు ఇండియన్‌ మార్కెట్‌లో అనేక కంపెనీల స్టాక్‌ విలువలు భారీగా పెరగడం, పలు కంపెనీల త్రైమాసిక ఫలితాలను మార్కెట్లను ఉత్సాహపరిచేలా లేకపోవడంతో సూచీలు నెలచూపులు చూశాయి.