బేకరీ నిర్వాహకుడికి జ్యుడీషియల్ రిమాండ్

0

అక్షరటుడే, వెబ్ డెస్క్: నిజామాబాద్లోని సుభాష్ నగర్లో గల డ్రీమ్ డిసర్ట్స్ బెకరీ యజమానికి రెండ్రోజుల జైలు శిక్ష విధిస్తూ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ సయ్యద్ ఖదీర్ శుక్రవారం తీర్పునిచ్చారు. స్థానికంగా డ్రీమ్ డిసర్ట్స్ బేకరీ నడుపుతున్న నిర్వాహకుడు ప్రేమికుల కోసం క్యాబిన్స్ అద్దెకు ఇస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గురువారం పక్కా సమాచారంతో దాడి చేసి నిర్వాహకుడిని అరెస్టు చేశారు. శుక్రవారం కోర్టులో ప్రవేశపెట్టగా.. నిర్వాహకుడికి రెండ్రోజుల జైలు శిక్ష ఖరారైనట్లు మూడో టౌన్ ఎస్సై ప్రవీణ్ తెలిపారు.

ప్రత్యేక క్యాబిన్ల దందా!

నగరంలో పలు ఐస్క్రీం పార్లర్లు, బేకరీల పేరిట నిర్వాహకులు ప్రత్యేక క్యాబిన్స్ ఏర్పాటు చేశారు. కేవలం లవర్స్ కోసం వీటిని అద్దెకు ఇస్తున్నారు. ఇలాంటి మరికొన్ని వాటిపైనా పోలీసులకు సమాచారం అందింది. వాటిపై కూడా చర్యలు తీసుకుంటారని తెలిసింది. నిజామాబాద్ రూరల్ పోలీసులు సైతం గురువారం పలు బేకరీల్లో తనిఖీలు చేశారు.