అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bengal riots : పశ్చిమబెంగా(West Bengal)ల్లో జరిగిన అల్లర్లపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Chief Minister Mamata Banerjee) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనలు ముందస్తు ప్రణాళిక ప్రకారమేనని ఆరోపించారు.
వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఇటీవల ముర్షిదాబాద్ లో జరిగిన మత హింస ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగిందన్నారు. బీజేపీతో పాటు కొన్ని కేంద్ర సంస్థలు, అలాగే బీఎస్ఎఫ్ లోని కొన్ని శక్తులు దీనికి ఆజ్యం పోశాయని సంచలన ఆరోపణలు చేశారు. కోల్కతాలో బుధవారం ముస్లిం మత పెద్దలతో జరిగిన సమావేశంలో దీదీ మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాల్లో అశాంతి నెలకొనడానికి ముందే బంగ్లాదేశ్ నుంచి సరిహద్దు చొరబాట్లను అనుమతించడం ద్వారా బీజేపీ ఉద్రిక్తతలను సృష్టిస్తోందని ఆరోపించారు.
Bengal riots : బీఎస్ఎఫ్ పైనా దీదీ ఆరోపణలు..
ముర్షిదాబాద్ అల్లర్ల వెనుక కేంద్ర బలగాల పాత్రపై దీదీ అనుమానాలు వ్యక్తం చేశారు. “ముర్షిదాబాద్ (Murshidabad ) అల్లర్లలో సరిహద్దు అవతల నుంచి వచ్చిన వ్యక్తుల పాత్ర ఉందని చెప్పే వార్తలు వచ్చాయి. అయితే, సరిహద్దును కాపాడటం బీఎస్ఎఫ్ పాత్ర కాదా? బీఎస్ఎఫ్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కిందనే ఉంది కదా’ అని వ్యాఖ్యానించారు.
రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ సరిహద్దులను కాపాడదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పించుకోజాలదన్నారు. హింసాత్మక ఘటనల సమయంలో స్థానిక యువత రాళ్లు రువ్వడానికి బీఎస్ఎఫ్ BSF ఎవరికి డబ్బు చెల్లించిందో కనుక్కుంటానని దీదీ అన్నారు.
Bengal riots : విభజన తేవాలనే..
బీజేపీపై మమత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హిందువులు, ముస్లింలను విభజించి దేశాన్ని విభజించాలనుకుంటున్నారని ఆరోపించారు. బయట నుంచి వచ్చిన బీజేపీ గూండాలతోనే గందరగోళం ఏర్పడిందని, వాళ్లను అసలు ఎందుకు అనుమతించారని ప్రశ్నించారు. వక్ఫ్ సవరణ చట్టం దేశాన్ని విభజిస్తుందని, దీన్ని అమలు చేయవద్దని ప్రధాని మోదీని దీదీ కోరారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను అదుపులో పెట్టాలని మోదీని అభ్యర్థించారు. అమిత్ షా “తన రాజకీయ ఎజెండా కోసం దేశానికి అత్యంత హాని కలిగించారని” ఆమె ఆరోపించారు.