అక్షరటుడే, వెబ్‌డెస్క్ Best AI Acs 2025 : అసలే వేసవి కాలం. పగటి పూట ఇంట్లో ఉండాలంటే చాలా కష్టం. ఫ్యాన్ గాలి కూడా సరిపోదు. 24 గంటలు ఏసీ నడవాల్సిందే. అందుకే ఇప్పుడు ఏ ఇంట్లో చూసినా ఏసీలు ఆన్ లోనే ఉంటాయి. నిజానికి ఏసీ అనేది కొత్తేమీ కాదు. ఇప్పటి వరకు ఎన్నో రకాల ఏసీలు ఉన్నాయి. కానీ, జనరేషన్ మారింది. ఇప్పుడు ఏసీలు స్మార్ట్ అయ్యాయి. (AI Technology) ఏఐ టెక్నాలజీతో ఏసీలను తయారు చేస్తున్నారు. ఏఐ టెక్నాలజీతో తయారైన ఏసీల్లో బెస్ట్ ఫీచర్స్ ఉన్నాయట. కరెంట్ బిల్లు తగ్గడంతో పాటు చాలా ఫీచర్స్ ఈ ఏఐ ఏసీ సొంతం.
యాప్ తో పని చేసే ఈ ఏఐ ఏసీలు (AI Acs) రూమ్ లో ఎంత టెంపరేచర్ ఉంది. ఎంత టెంపరేచర్ పెంచాలి.. లేదా తగ్గించాలి.. అని అన్నీ అంచనా వేసి దానికి తగ్గట్టుగా ఆటోమెటిక్ గా టెంపరేచర్ ని సెట్ చేసుకుంటుంది. ఏసీలో ఏదైనా సమస్య ఉన్నా అదే ఇండికేషన్ ఇస్తుంది. (Current bill) కరెంట్ బిల్లు తక్కువ, చల్లదనం ఎక్కువ. ఇలాంటి ఫీచర్లతో ప్రస్తుతం మార్కెట్ లో చాలా కంపెనీలు ఏఐ ఏసీలను తీసుకొచ్చాయి.
Best AI Acs 2025 : బెస్ట్ ఏఐ ఏసీలపై ఓ లుక్కేయండి
బెస్ట్ ఏఐ ఏసీలు అంటే చాలా ఉన్నాయి. ఎల్‌జి కంపెనీ నుంచి 5 స్టార్ స్ప్లిట్ ఏసీ విత్ ఏఐ కన్వర్టబుల్ 6 ఇన్ 1 కూలింగ్ ఏసీ ఒకటి. ఇది 6 మోడ్స్ తో పని చేయడంతో పాటు రూమ్ టెంపరేచర్ ప్రకారం కూలింగ్ ను సెట్ చేసుకుంటుంది.
డ్యూయల్ ఇన్వర్టర్ టెక్నాలజీ, ఓషన్ బ్లాక్ ప్రొటెక్షన్ లాంటి ఫీచర్లతో ఈ ఏసీ పనిచేస్తుంది. శాంసంగ్ నుంచి ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ, హైయర్ నుంచి 1.6 టన్ 5 స్టార్ ఇంటెల్లీ స్మార్ట్ స్ప్లిట్ ఏసీ, బ్లూ స్టార్ 1 టన్ 5 స్టార్ వైఫై ఇన్వర్టర్ స్మార్ట్ స్ప్లిట్ ఏసీ, పానాసోనిక్ నుంచి 1.5 టన్ స్మార్ట్ వైఫై ఇన్వర్టర్ ఏసీ.. ఇలా పలు బ్రాండ్స్ నుంచి (AI Technology) ఏఐ టెక్నాలజీతో తయారైన ఏసీలని మార్కెట్ లోకి వచ్చాయి.