Betting Apps | బెట్టింగ్​ యాప్​ కేసు.. దూకుడు పెంచిన పోలీసులు

Betting App | బెట్టింగ్​ యాప్​ కేసులో ప్రభుత్వం సంచలన నిర్ణయం
Betting App | బెట్టింగ్​ యాప్​ కేసులో ప్రభుత్వం సంచలన నిర్ణయం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Betting Apps | బెట్టింగ్​ యాప్​ కేసులో పోలీసులు(Police) దూకుడు పెంచారు. బృందాలుగా ఏర్పడిన పోలీసులు కేసుతో సంబంధం ఉన్న ఏ ఒక్కరినీ వదిలి పెట్టకుండా వ్యవహరిస్తున్నారు.

Advertisement
Advertisement

బెట్టింగ్ యాప్​లను ప్రమోట్​ చేసిన పలువురు హీరోలు, హీరోయిన్లు, నటులతో పాటు సోషల్​ మీడియా ఇన్​ఫ్లూయెన్సర్లపై ఇప్పటికే కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పలు బెట్టింగ్​ యాప్​ నిర్వాహకులపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. తాజాగా సినీ యాక్టర్స్‌(Actors) ప్రమోట్ చేసిన బెట్టింగ్‌ యాప్(Betting apps)​లను గుర్తించారు.

జంగిల్‌ రమ్మి యాప్‌ కోసం రాణ్​, ప్రకాష్‌రాజ్‌, ఏ23 యాప్‌ కోసం విజయ్‌ దేవరకొండ, యోలో 247 కోసం మంచు లక్ష్మి, ఫెయిర్‌ ప్లే లైవ్‌ కోసం హీరోయిన్‌ ప్రణీత, జీట్‌విన్‌ యాప్‌ కోసం నిధి అగర్వాల్‌, ఆంధ్ర 365 యాప్‌ కోసం యాంకర్​ శ్యామల ప్రమోట్​ చేసినట్లు గుర్తించారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Congress | కాంగ్రెస్​లోని ఇరువర్గాల ఘర్షణ

హర్షసాయి, విష్ణుప్రియ, రీతుచౌదరి, టేస్టీ తేజ, భయ్య సన్నీలు ప్రచారం చేసిన యాప్​లను గుర్తించిన పోలీసులు త్వరలో వీరిని విచారించనున్నారు. వీరి స్టేట్​మెంట్​ ఆధారంగా యాప్​ల నిర్వాహకులపై కూడా కేసులు పెట్టాలని పోలీసులు యోచిస్తున్నారు.

Advertisement