Betting App | బెట్టింగ్​ యాప్​ కేసు.. హైకోర్టును ఆశ్రయించిన విష్ణుప్రియ

Betting App | బెట్టింగ్​ యాప్​ కేసు.. హైకోర్టును ఆశ్రయించిన విష్ణుప్రియ
Betting App | బెట్టింగ్​ యాప్​ కేసు.. హైకోర్టును ఆశ్రయించిన విష్ణుప్రియ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Betting App | బెట్టింగ్​ యాప్​ ప్రమోట్​ చేసిన నటులు, సోషల్​ మీడియా ఇన్​ఫ్లూయెన్సర్లు తమ కేసులు నమోదు కావడంతో హైరానా పడుతున్నారు. కాసుల కోసం నిషేధిత యాప్​లను ప్రమోట్(promote)​ చేసి ఎంతో మంది జీవితాలు నాశనం చేశారని వారిపై పోలీసులు(polie) కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో తమను ఎక్కడ అరెస్ట్(Arrest)​ చేస్తారోననే భయం వారిని వేధిస్తోంది. ఇప్పటికే పలువురు సోషల్​ మీడియా (Social Media) ఇన్​ఫ్లూయెన్సర్లు(influencers) పరారీలో ఉండగా నటులు కోర్టులను ఆశ్రయిస్తున్నారు.

Advertisement
Advertisement

Betting App | క్వాష్ పిటిషన్ దాఖలు

బెట్టింగ్ యాప్స్ కేసులో తనపై నమోదైన రెండు ఎఫ్‌ఐఆర్‌(FIR)లను కొట్టివేయాలని టీవీ నటి విష్ణుప్రియ హైకోర్టు(High Court)లో పిటిషన్​ వేశారు. ఈ పిటిషన్​ను కోర్టు మంగళవారం విచారించనుంది. కాగా విష్ణుప్రియ(Vishnupriya) ఇదివరకే ఈ కేసులో పంజాగుట్ట(Punjagutta) పోలీసుల ఎదుట లాయర్​తో కలిసి విచారణకు హాజరైంది. యాంకర్​ శ్యామల కూడా కోర్టులో పిటిషన్​ వేయగా అరెస్టు చేయొద్దని న్యాయస్థానం సూచించిన విషయం తెలిసిందే. అంతేగాకుండా పోలీసులకు సహకరించాలని కోర్టు ఆదేశించడంతో ఆమె కూడా విచారణకు హాజరయ్యారు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Betting Apps | బెట్టింగ్​ యాప్స్​​ కేసులో కీలక పరిణామం.. వారికి బిగుస్తున్న ఉచ్చు