Betting APP Case | ఆ నటులను అరెస్ట్​ చేయకపోతే సుప్రీం కోర్టుకు వెళ్తా: కేఏ పాల్

Betting APP Case | ఆ నటులను అరెస్ట్​ చేయకపోతే సుప్రీం కోర్టుకు వెళ్తా
Betting APP Case | ఆ నటులను అరెస్ట్​ చేయకపోతే సుప్రీం కోర్టుకు వెళ్తా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Betting APP Case | బెట్టింగ్​ యాప్​ ప్రమోట్​ చేసిన నటులను(Actors) అరెస్ట్​ చేయాలని.. లేకపోతే తాను సుప్రీంకోర్టుకు వెళ్తానని కేఏ పాల్(KA Paul)​ అన్నారు.

Advertisement
Advertisement

ఈ మేరకు ఆయన వీడియో విడుదల చేశారు. విజయ్ దేవరకొండ, బాలకృష్ణ, ప్రభాస్​, గోపిచంద్​, మంచు లక్ష్మి ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన 25 మంది త్వరలో అరెస్టు అవుతారని ఆయన పేర్కొన్నారు. సీని హీరోలు, హీరోయిన్లు ప్రమోట్​(promote) చేయడంతో వారిని అభిమానించే ఎందరో యాప్​లను డౌన్​లోడ్(download)​ చేసుకొని మోసపోయారన్నారు.

Betting APP Case | ఆ డబ్బును బాధిత కుటుంబాలకు పంచాలి

బెట్టింగ్​ యాప్​ ప్రమోట్​ చేసిన వారు ప్రకాశ్​రాజ్​ లాగా తప్పు చేశామని, క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్​ చేశారు. బెట్టింగ్​ యాప్​ల(betting apps)తో అప్పులపాలై 980 మంది ఆత్మహత్య చేసుకున్నారని పాల్​ తెలిపారు. బెట్టింగ్​ యాప్​ ప్రమోట్​ చేసి సంపాదించిన మొత్తాన్ని ఆ యాప్​ల​తో చనిపోయిన వారి కుటుంబాలకు పంచాలని డిమాండ్​ చేశారు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Human Rights | పౌరుల హ‌క్కుల‌ను కాపాడ‌డం కోర్టుల విధి.. భావ ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ‌ను గౌర‌వించాల్సిందే