అక్షరటుడే, బోధన్ : Online Betting | ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న బోధన్‌కు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పట్టణ ఎస్‌హెచ్‌వో(SHO) తెలిపిన వివరాల ప్రకారం.. బోధన్‌లోని బీటీ నగర్‌కు చెందిన షేక్ సయీద్ అలియాస్ మాము ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్(Online Cricket Betting) నిర్వహిస్తున్నాడు. పోలీసులు అతడి ఇంటిపై దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు.
నిజామాబాద్‌కు చెందిన ముజీబ్, సచిన్ తనకు యూజర్ ఐడీ క్రియేట్ చేసి ఇచ్చారని నిందితుడు తెలిపాడు. ఆ ఐడీతో పలువురు యువకులతో సయీద్ ఆన్లైన్ బెట్టింగ్ పెట్టించాడు. ఆ డబ్బు ముజీబ్‌కు ఇచ్చేవాడు. ఇందుకుగాను వారు ఆయనకు ఐదు శాతం కమీషన్‌ను ఇచ్చేవారు. షేక్ సయీద్‌ను అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్(Police Remind)కు తరలించారు. నిందితుడి నుంచి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకొని, బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ చేశామని ఎస్‌హెచ్‌వో తెలిపారు.